
వైభవంగా అనంత చతుర్థి వేడుకలు
మంత్రాలయం : ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో అనంత చతుర్దశి వేడుకలు వైభవంగా జరిగాయి. శనివారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆధ్వర్యంలో పూజా మందిరంలో విశేషంగా పూజలు చేపట్టారు. స్వర్ణ మండపంలో అనంత పద్మనాభ స్వామిని కొలువుంచి వేద ఘోష శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభిషేకాది పుష్పార్చనలతో ఎంతో శోభాయమానంగా వేడుక చేపట్టారు. అలాగే శుక్ర, ఆది వారాలు సెలవులు కలిసిరావడంతో శ్రీమఠంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తుల దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. తుంగాతీరం, మధ్వకారిడార్, అన్నపూర్ణ భోజనశాలతో భక్తుల కోలాహలం నెలకొంది.

వైభవంగా అనంత చతుర్థి వేడుకలు