
రక్త పరీక్షలు చేయించుకోవాలి
ఏటా ఆగస్టు నుంచి మూడు నెలల పాటు వాతావరణంలో వచ్చే అనూహ్య మార్పులు వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు ప్రధాన కారణం. డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్, చికెన్ గున్యాల నిర్ధారణ కోసం రోగికి రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది. సకాలంలో ప్రభుత్వాసుపత్రిలో వైద్యులను సంప్రదించి వైద్య చికిత్స అందిస్తే వైరల్ ఫీవర్‌ను తగ్గించవచ్చు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– డాక్టర్ మాధవ కృష్ణ, చిన్నపిల్లల వైద్యులు, అసోసియేట్ ప్రొఫెసర్, నంద్యాల జిల్లా ఆసుపత్రి