
వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై పోలీసుల జులుం
● స్టేషన్‌కు పిలిపించి చితకబాదిన సీఐ
● పోలీసు స్టేషన్ ఎదుట
కుటుంబీకుల ఆందోళన
ఆత్మకూరు: చిన్న కేసు విషయలో రాజీ అంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తను స్టేషన్‌కు పిలిచి సీఐ చితిక బాదిన ఘటన ఆత్మకూరు పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడు, అతని కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. ఆత్మకూరు పట్టణానికి చెందిన మాసుంబాషా అనే వ్యక్తి మన్సూర్‌కు రూ.10 వేలు బదులిచ్చాడు. రెండు రోజుల్లో ఇస్తానని పది నెలలు గడిచినా ఇవ్వకపోవడంతో శుక్రవారం రాత్రి వారి మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో అక్కడే వున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త, వైఎస్సార్‌సీపీ వార్డు కౌన్సిలర్ కలిముల్లా కుమారుడు ఖాదర్‌బాషా వారికి సర్ది చెబుతుండగా తోపులాట జరిగింది. దీంతో మన్సూర్, ఖాదర్‌బాషా తనపై దాడి చేశారని మాసుంబాషా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఖాదర్‌బాషాను పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. సీఐ రాము అతడి నుంచి ఘర్షణ వివరాలు తెలుసుకుంటూ చితకబాదినట్లు తెలుస్తోంది. తాను వైఎస్సార్‌సీపీ కార్యకర్త, మాజీ ఎమ్మెల్యే శిల్పా మనిషి కావడంతోనే సీఐ కొట్టాడని తాను కుటుంబీలకు చెప్పాడు. ఇది అన్యాయమంటూ ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆవేదన చెందాడు. దీంతో అతని తల్లిదండ్రులు, వైఎస్సార్‌సీపీ వార్డు కౌన్సిలర్ సభ్యులు కలిముల్లా, షఫీవున్‌లు, కుటుంబీకులు, పార్టీ శ్రేణులతో కలసి పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడితే సర్ది చెప్పిన వ్యక్తిపై ఎలా దాడి చేస్తారని మండిపడ్డారు. సీఐ రాముపై చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి అక్కడికి చేరుకుని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత వెల్లడిస్తామని ఆందోళన విరమించాలని కోరడంతో వారు శాంతించారు.
నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా
ఆత్మకూరు పట్టణానికి చెందిన వైఎస్సార్‌సీపీ వార్డు కౌన్సిలర్ కలిముల్లా కుమారుడు ఖాదర్‌బాషాపై జరిగిన దాడిపై ఆదివారం కూడా ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి తెలిపారు. పెద్ద ఎత్తున ధర్నా చేపడతామన్నారు. సీఐ రాము తమ పార్టీ కార్యకర్తను చితకబాదడం అన్యాయమన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళ చేస్తామన్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై పోలీసుల జులుం

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై పోలీసుల జులుం