విలువలతో కూడిన విద్యనందించాలి | - | Sakshi
Sakshi News home page

విలువలతో కూడిన విద్యనందించాలి

Sep 6 2025 4:39 AM | Updated on Sep 6 2025 4:39 AM

విలువ

విలువలతో కూడిన విద్యనందించాలి

మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల(న్యూటౌన్‌): ఉపాధ్యాయులు విద్యార్థుల కు విలువలతో కూడిన విద్యను అందించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం–2025 కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, జిల్లా కలెక్టర్‌ రాజకుమారి, డీఈఓ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నా రు. ముందుగా భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ముఖ్య అతిథులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలన్నారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి చక్కగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే విధంగా వారిని తీర్చిదిద్దాలన్నారు.

బాలరాజు మాస్టార్‌ ఎప్పటికీ మరిచిపోను..

జిల్లా కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావా లన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చొరవ చూపాలనాన్నారు. మొదటి పోస్టింగ్‌ విజయనగరం జిల్లాలో చేసినప్పుడు ఆఫీస్‌ ముందు ఒక పెద్ద హోర్డింగ్‌ పెట్టి అందులో విద్యాభివృద్ధికి సంబంధించిన మంచి మంచి సూక్తులు రాయించడం జరిగిందని కలెక్టర్‌ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మారుమూల గ్రామంలో 35 ఇల్లు ఉన్న ఒక పల్లె నుంచి వచ్చి ఈరోజు కలెక్టరుగా అందరి ముందు మాట్లాడుతున్నాను అంటే తల్లిదండ్రులు వారు పెంచిన విధానం వారు నేర్పిన విలువలు నాకు అక్షరాభ్యాసం చేసిన బాలరాజు మాస్టారే కారణమన్నారు. అన్నపూర్ణ లెక్కల టీచర్‌కి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఉత్తమ ఉపాధ్యాయ

అవార్డు గ్రహీతలకు సన్మానం...

జిల్లా వ్యాప్తంగా 48 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, జిల్లా కలెక్టర్‌ రాజకుమా రి సత్కరించి, జ్ఞాపికా ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఉపాధ్యాయులందరికీ పేరుపేరునా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, డిప్యూటీ డీఈఓలు, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయురాలిని సన్మానిస్తున్న మంత్రి, కలెక్టర్‌ తదితరులు

విలువలతో కూడిన విద్యనందించాలి1
1/1

విలువలతో కూడిన విద్యనందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement