
పర్యాటకం అభివృద్ధికి మార్గాలెన్నో..
శ్రీశైలం, సున్నిపెంట ప్రాంతాల్లో కోకోల్లలుగా హిల్ వ్యూ ప్రదేశాలు ఉన్నాయి. ఏపీ టూరిజం శాఖ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దైవ దర్శనానికి వచ్చిన పర్యాటకులు రెండు, మూడు రోజులు ఇక్కడే బస చేసి పర్యాటక ప్రాంతాలను తిలకించడంతో
టూరిజం అభివృద్ధితో పాటు పాటు స్థానిక యువతి, యువకులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడతాయి.
● శ్రీశైలానికి 17 కిలోమీటర్ల దూరంలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి భక్తులు అధికసంఖ్యలో అసక్తి చూపుతారు. పూర్తిగా దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉండడంతో టూరిజం శాఖ ఆ దిశగా ఆలోచనలు చేసి ఇష్టకామేశ్వరి జంగిల్ సఫారీ ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతం నెక్కంటి జంగిల్ సఫారీ పేరుతో ఇష్టకామేశ్వరి దర్శనానికి ప్రైవేట్ జీపుల ద్వారా భక్తులను అనుమతిస్తున్నారు. అలాగే అటవీశాఖ అధికారులు ఓపెన్‌టాప్ జీపులను ఏర్పాటు చేసి అడవిలో సంచరించే జంతువులను పర్యాటకులు వీక్షించేలా ఏర్పాట్లు చేయవచ్చు.
● తెలంగాణ ప్రాంతంలోని అమ్రాబాద్ వద్ద ఉన్న అక్టోపస్ వ్యూ పాయింట్ మాదిరిగా శ్రీశైలం సమీప నల్లమల అడవుల్లో ఏర్పాటు చేయవచ్చు. అడవుల్లో పర్యాటకులు ఒకరోజు విడిది చేసేలా టూరిజం శాఖ రిసార్ట్స్ నిర్మించవచ్చు. కాగా ఈ ప్రాంతం టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో అనుమతులకు పాలకులు కృషి చేయాల్సి ఉంది.
● నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని సున్నిపెంట బయోడైవర్శిటీ ల్యాబ్, ఎకలాజికల్ పార్క్ అలాగే పర్యావరణ విజ్ఞాన కేంద్రం మూడింటిని కలుపుతూ ఎకో టూరిజంగా తీర్చిదిద్ది అందుబాటులోకి తెస్తే పర్యాటకులు మరింత పెరిగే అవకాశం ఉంది.