డాక్టర్‌.. ఉద్యోగాల్లేవ్‌! | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌.. ఉద్యోగాల్లేవ్‌!

Sep 6 2025 4:39 AM | Updated on Sep 6 2025 4:39 AM

డాక్టర్‌.. ఉద్యోగాల్లేవ్‌!

డాక్టర్‌.. ఉద్యోగాల్లేవ్‌!

● నిష్ప్రయోజనంగా మారిన ఫార్మా–డి కోర్సు ● ఉమ్మడి జిల్లాలో 1400 మందికి పైగా నిరుద్యోగులు

● నిష్ప్రయోజనంగా మారిన ఫార్మా–డి కోర్సు ● ఉమ్మడి జిల్లాలో 1400 మందికి పైగా నిరుద్యోగులు

కర్నూలు(హాస్పిటల్‌): డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసి (ఫార్మా–డి) కోర్సును పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు దొరకడం లేదు. దీంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ కోర్సును 2008లో అప్పటి యుపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కోర్సు చేసిన వారికి డాక్టర్‌తో సమానంగా హోదా లభిస్తుందని చెప్పడంతో అప్పట్లో విద్యార్థులు చాలా మంది ఆసక్తి చూపించారు. కర్నూలు జిల్లాలో రెండు, నంద్యాల జిల్లాలో రెండు ఫార్మసి కాలేజీల్లో ఒక్కో దాంట్లో 30 సీట్ల చొప్పున కోర్సును ప్రారంభించారు. అప్పట్లో ఎంబీబీఎస్‌లో సీటు రాని వారు డెంటల్‌ లేదా ఫార్మా–డి కోర్సును ఎంచుకునేవారు.

కొత్త పోస్టులు లేవు

ఎంబీబీఎస్‌తో సమానంగా ఈ కోర్సు ఆరు సంవత్సరాలు(5 ప్లస్‌ 1 సంవత్సరం ఆసుపత్రిలో ఇంటర్నిషిప్‌) చదవాల్సి ఉంది. క్లినికల్‌ ఓరియంటెడ్‌ ప్రొఫెషనల్‌ డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌, హ్యూమన్‌ అనాటమి అండ్‌ ఫిజియాలజీ, ఫార్మకాలజి మొదలైన వాటితో పాఠ్యాంశాలు బోధించారు. ఎవిడెన్స్‌ బేస్డ్‌ మెడిసిన్‌ ఆధారంగా రోగులకు హేతుబద్ధమైన డ్రగ్‌ థెరపిని అందించేందుకు డ్రగ్‌ జ్ఞానాన్ని వర్తింపజేసేందుకు సహాయపడుతుంది. క్లినికల్‌ ఫార్మాసిస్ట్‌ల పాత్ర అభివృద్ధి చెందిన దేశాల్లో బాగా గుర్తించారు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ కోర్సును ఆమోదించింది. ఒక విధంగా చెప్పాలంటే పేరు ముందు డాక్టర్‌ అని రాసుకోవచ్చని అప్పట్లో విద్యార్థులను ఊరించారు. ఈ కోర్సు చదివిన వారికి ఫార్మా కంపెనీల్లో రీసెర్చ్‌ విభాగంలో ఉద్యోగంలో చేరవచ్చని చెప్పారు. అయితే వీరిని ఉపయోగించేందుకు కొత్త పోస్టులు సృష్టించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement