
ఆ వైపు పడవెళ్లిపోతుంది..
తెలంగాణ రాష్ట్రం పర్యాటక అభివృద్ధిలో భాగంగా పడవ ప్రయాణం కూడా అందుబాటులోకి తెచ్చింది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం బోటు షికార్‌ను ఎప్పుడో ప్రారంభించింది. అంతేకాకుండా సోమశిల నుంచి పాతాళగంగకు కృష్ణానదిపై బోటులో ప్రయాణిస్తూ నల్లమల అందాలను ఆస్వాదించవచ్చు. అక్కడ రిసార్ట్స్ ఏర్పాటు చేసి పర్యాటకులు బస చేసే అవకాశం కల్పించింది. ఈ గట్టున సంగమేశ్వరం కూడా ఇందుకు అనువుగా ఉన్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో హడావుడి చేసి చేతులెత్తేసింది. సంగమేశ్వర క్షేత్రానికి సమీపంలోనే రాష్ట్రంలోనే ఏకై క సరస్వతి అమ్మవారు కొలువైన క్షేత్రం కొలను భారతి. ఈ రెండు కేంద్రాలను శ్రీశైలం నుంచి పర్యాటకులు కృష్ణానది మీదుగా ప్రయాణించి దర్శించుకునే అవకాశం ఉంది. ఆ దిశగా రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు ఆలోచన చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.