
ఓటీపీ జాప్యం.. అంతా గందరగోళం
వెలుగోడు: ఓటీపీ ద్వారా యూరియా పంపిణీ చేపట్టడంతో రైతులు గందరగోళానికి గురయ్యారు. గంటల తరబడి లైన్‌లో నిలబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతుల భూమి డాక్యుమెంట్స్ ఆధార్ లింక్, సెల్ నెంబర్ లింక్ లేకపోవడంతో ఓటీపీ మరింత ఆలస్యం అవుతుంది. మరికొందరి రైతులకు భూమి పత్రాలు ఆన్‌లైన్‌లో లేకపోవడం వల్ల ఓటీపీ రావడం లేదు. ఇలాంటి రైతులకు యూరియా ఇవ్వడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటీపీ ఆలస్యమవుతుండటంతో వ్యవసాయ శాఖ అధికారులు టోకన్లు జారీ చేసి ఒక్కో పాస్‌బుక్‌కు రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు.కౌలు రైతులకు, సెల్ నెంబర్ లింక్ లేనివారికి, డాక్యుమెంట్స్ సరిగా లేని రైతులకు మాత్రం యూరియా దక్కేలా లేదు.