
ఎదురు చూస్తున్నాం
గత ఏడాది సొంతపొలం ఎనిమిది ఎకరాలతోపాటు ఎకరా రూ. 18 వేలు కౌలు చెల్లించి మరో 12 ఎకరాల పొలాన్ని తీసుకుని శనగ పంట సాగు చేశాను. వాతావరణం అనుకూలించక దిగుబడులు తగ్గిపోయాయి. తెల్లశనగలో ఎకరాకు 5 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. దిగుబడులు చేతికందేనాటికి మార్కెట్‌లో క్వింటా రూ. 6,500 ధర ఉండటంతో ఈ ధరకు అమ్ముకోలేక పంట ఉత్పత్తులను ఎనిమిది నెలల నుంచి గోదాములో భఽద్రపరుచుకుని గిట్టుబాటు ధర కోసం ఎదురుచూస్తున్నాను. – అబ్రహం, రైతు, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం