
కర్నూలు సర్కిల్ ఎస్‌ఈకి అదనపు బాధ్యతలు
కర్నూలు సిటీ: జల వనరుల శాఖ కర్నూలు సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్‌గా పని చేస్తున్న బి.బాల చంద్రారెడ్డికి శ్రీశైలం డ్యాం నిర్వహణ పర్యవేక్షక ఇంజనీర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలం డ్యాం నిర్వహణ పర్యవేక్షక ఇంజనీర్ పోస్టు రెండున్నర నెలలుగా ఖాళీగా ఉంది. జూన్ నెలలో అక్కడ పర్యవేక్షక ఇంజనీర్‌గా పని చేస్తున్న పి.శ్రీరామచంద్రమూర్తి పదోన్నతిపై కడప ప్రాజెక్ట్స్ సీఈగా వెళ్లారు. అప్పటి నుంచి ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ గత నెల 31న పదవీ విరమణ పొందారు. దీంతో ఆ స్థానంలో బి.బాల చంద్రారెడ్డికి అదన పు బాధ్యతలు అప్పగించారు.