
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి
గోస్పాడు: పీహెచ్‌సీల పరిధిల్లో సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా వైద్యులు తగు చర్యలు తీసు కోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని సర్వజన ఆసుపత్రి ఎంసీహెచ్ బ్లాక్ సమావేశ భవనంలో జిల్లా మలేరియా నివారణ అధికారి చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలకు రోగాలు ప్రబలే అవకాశం అధికంగా ఉంటుందన్నారు. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి వ్యాధుల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.అలాగే వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరణ్, జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కాంతరావునాయక్ పాల్గొన్నారు.