
ట్రిబుల్ ఐటీలో ‘ఇస్రో’ ప్రదర్శన
● ప్రారంభించిన ఆర్‌యూ వీసీ
● ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు
కర్నూలు సిటీ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్(ట్రిబుల్ ఐటీడీఎం)లో ‘ఇస్రో స్పేస్ ఆన్ వీల్స్’ అనే పేరుతో సోమవారం ప్రదర్శన నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్‌ను రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఆచార్య వి.వెంకట బసవ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రయాన్–3 విజయంతో ప్రపంచంలోని దేశాలన్నీ భారతదేశం వైపు చూశాయన్నారు. అంతరిక్ష పరిజ్ఞానాన్ని ప్రజలకు విద్యార్థులకు తెలియజేసేందుకు స్పేస్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ట్రిబుల్ ఐటీడీఎంలో ఏర్పాటు చేశామని ఇస్రో సైంటిస్టులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, అవగహన పెరుగుతుందన్నారు. అంతరిక్షం గురించి తెలియజేసేందుకు ప్రదర్శన ఉపయోగపడుతుందన్నారు.
రూ.10 కోట్ల ఖర్చు
ఇస్రో ప్రత్యేకంగా రూ.10 కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో 50 ఏళ్ల నుంచి ఇస్రో సాధించిన విజయాల నుంచి చంద్రయాన్ వరకు సాధించిన విజయాల గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాలోని 33 స్కూల్స్, కాలేజీలకు చెందిన 2 వేల మంది విద్యార్థులు ఈ ప్రదర్శనకు ఉపయోగపడనుంది. బస్సుల్లోని రాకెట్ల నమూనాలు, చంద్రయాన్‌ల గురించి ట్రిబుల్‌ఐటీ విద్యార్థులు, ఇస్రో ప్రతినిధులు వివరించారు. స్కూల్, కాలేజీల విద్యార్థులు ఎంతో ఆసక్తితో రాకెట్లను స్వయంగా చూసి అడిగి తెలుసుకున్నారు. నేడు(మంగళవారం)ఇస్రో బస్సు కేవీఆర్ మహిళ డిగ్రీ కాలేజీలో ప్రదర్శన ఉన్నట్లు ఇస్రో ప్రతినిధులు తెలిపారు. ట్రిబుల్ ఐటీ రిజిస్ట్రార్ రాజ్‌కుమార్, ఆర్‌యూ రిజిస్ట్రార్ బి.విజయ్‌కుమార్, ఆచార్యులు డీన్స్ నరేష్, సత్యబాబు, ఆర్డినేటర్ డా.వినయ్ తీవారీ, ఇస్రో రిటెర్డ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ట్రిబుల్ ఐటీలో ‘ఇస్రో’ ప్రదర్శన

ట్రిబుల్ ఐటీలో ‘ఇస్రో’ ప్రదర్శన