
నంద్యాల ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
గోస్పాడు: నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా చేసినట్లు సూపరింటెండెంట్ మల్లేశ్వరి తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నంద్యాల పట్టణానికి చెందిన 30 ఏళ్ల మీనా జోషి కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంగా ఉంటుండటంతో చికిత్స కోసం కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్చారు. ఈమేరకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ప్రసూతి, గైనకాలజీ విభాగంలో మహిళకు వైద్య పరీక్షల అనంతరం అండాశంలో భారీ గడ్డ (25ఇంటు28సెం.మీ) సుమారుగా 5 కిలోలు ఉన్నట్లు వైద్యలు గుర్తించారు. వైద్య పరీక్షల అనంతరం గత నెల 20వ తేదీన గైనిక్ హెచ్‌ఓడీ డాక్టర్ పద్మజ, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీనారాయణమ్మ, డాక్టర్ సుధారాణి, అనస్తీషియా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స చేసి అండాశంలో భారీ గడ్డను తొలగించారు. అనంతరం ఆమె సురక్షితంగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశామని సూపరింటెండెంట్ తెలిపారు.