
కూటమి ప్రభుత్వం అన్నింటా విఫలం
ఆలూరు: కూటమి ప్రభుత్వం అన్నింటా విఫలమైందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుబ శశికళ విమర్శించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సును ప్రవేశపెట్టిన ప్రభుత్వం అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయకపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సెప్టెంబర్ 1న ఉదయం 10 గంటలకు కర్నూలు ఎస్‌వీ కాన్వెన్షన్ హాల్లో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రసిడెంట్ ఎస్‌వీ విజయ మనోహరి ఆధ్వర్యంలో జిల్లా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం కార్యకర్తల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి అన్ని నియోజకవర్గాల నుంచి మహిళా ప్రజా ప్రతినిధులు, పార్టీ పదవులు పొందిన వారు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.