
బ్యాగుల నాణ్యత భుజాలకెరుక!
కూటమి ప్రభుత్వం ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్’ అంటూ విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు కనీసం రెండు నెలలు కూడా మన్నిక రాలేదు. బ్యాగుల నాణ్యతపై మంత్రి లోకేష్ అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేకంగా వివరించారు. ఏడాది పాటు విద్యార్థుల పుస్తకాలు మోయాల్సిన బ్యాగులు మున్నాళ్ల ముచ్చటగా మారాయి. నెల రోజుల్లోనే చిరిగి పోయి ఇంట్లో మూలన పడ్డాయి. దీంతో కొందరు తల్లిదండ్రులు దిక్కుతోచక కొత్త బ్యాగులు కొంటే, మరి కొందరూ రసాయన ఎరువుల సంచులను బ్యాగులుగా కుట్టిస్తున్నారు. మరి కొంత మంది విద్యార్థులు గతేడాది వైఎస్సార్‌సీపీ ఇచ్చిన జగనన్న బ్యాగులే బాగున్నాయని దాచుకున్న వాటిని బయటకు బడికి తీసుకొస్తున్నారు. శనివారం దొర్నిపాడు జిల్లా పరిషత్ విద్యార్థులు తీసుకొచ్చిన బ్యాగులే ఇందుకు నిదర్శనం. – దొర్నిపాడు

బ్యాగుల నాణ్యత భుజాలకెరుక!

బ్యాగుల నాణ్యత భుజాలకెరుక!