
అట్టెకల్లు కొండల్లో చిరుత
ఆస్పరి: అట్టెకల్లు కొండల్లో చిరుత సంచారంతో గ్రామస్తులు ఆందోళ న చెందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున శ్రీను అనే రైతు ఇంటి దగ్గర కట్టేసి న గొర్రె పిల్లపై చిరుత దాడి చేసి గాయపరిచింది. గాయపడిన గొర్రె పిల్ల కొద్ది సేపటికి మృతి చెందింది. చిరుత సంచారంతో వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, రైతులు భయాందోళనలు చెందుతున్నారు. ఫారెస్టు అధికారులు చిరుతను బంధించి ఇతర ప్రాంతాలకు తరలించాని గ్రామస్తులు కోరుతున్నారు.
విద్యార్థి ఆత్మహత్య
ఆళ్లగడ్డ: కళాశాలకు వెళ్లి చదవడం ఇష్టం లేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నల్లగట్ల గ్రామానికి చెందిన వీరయ్య కుమారుడు యశ్వంత్ (17) పట్టణంలోని ఓ ప్రైవేటు కళా శాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తనకు చదవడం ఇష్టం లేదని కులవృత్తి పౌరోహిత్యం నేర్చుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. చదివితే భవిష్యత్ బాగుంటుందని తల్లిదండ్రులు నచ్చజెప్పినా కళాశాలకు వెళ్లలేదు. కనీసం ఇంటర్ అయినా పూర్తి చేయాలని సోమవారం రాత్రి మందలించారు. ఈ క్రమంలో యశ్వంత్ మనస్తాపంతో పురుగు మందు తాగి మృతి చెందాడు. మృతుని తండ్రి వీరయ్య ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
క్లుప్తంగా