అయ్యో.. అఖిల●
● మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి జనసేనకు కేటాయింపు
● చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ముందుగానే బీ ట్యాక్స్
● అధిష్టానంపై అలకబూని గండ్లేరు నీటి విడుదలకు గైర్హాజరు●
● చిచ్చురేపిన మార్కెట్ కమిటీ
చైర్మన్‌ల ప్రకటన
● మంత్రి టీజీ భరత్, ఎంపీ నాగరాజు
మధ్య విభేదాలు
● బీసీలకు విలువ లేదని
సన్నిహితుల దగ్గర వాపోయిన వైనం
● ఆదోనిలో టీడీపీకి ఇవ్వడంపై ఎమ్మెల్యే పార్థసారధి ఆగ్రహం
ఆళ్లగడ్డ: జిల్లాలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారా? ఆమె, భర్త వ్యవహారశైలి అధికారపార్టీకి తలనొప్పిగా మారిందా? కూటమి ప్రభుత్వంలోని ఏ నాయకుడికీ వారు నచ్చడం లేదా ? ఇక వారిని పక్కన పెట్టాలి అనే ఆలోచనకు అధిష్టానం వచ్చిందా ?.. అని అంటే జరుగుతున్న సంఘటనలు చూస్తే అవుననిపిస్తోంది. ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీకి జనసేనలో ఓ వర్గానికి చెందిన మేలేరి మల్లయ్య భార్య సురేఖను నియమించడంపై నియోజకవర్గంలో అందరూ షాక్‌కు గురయ్యారు. దాదాపు మూడు నెలల క్రితమే జనరల్ కోటాలో కేటాయించిన ఈ పదవికి టీడీపీలోని సీనియర్ నాయకులు అనేక మంది పోటీ పడ్డారు. అయితే ఎవరు ఎక్కువ మొత్తం ‘బీ’ ట్యాక్స్ చెల్లిస్తే వారికే ఆ పదవి అని చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలో ఎక్కువ మొత్తం ఇచ్చిన వారికి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులతో పాటు డైరెక్టర్‌ల పదవులు కూడా అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో అఖిలప్రియకు చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆళ్లగడ్డ జనసేన పార్టీలోని ఓ వర్గం నేత మైలేరి సురేఖకు చైర్మన్‌గిరి కేటాయించారని చర్చ జరుగుతోంది.
అడ్వాన్స్ ఇచ్చి.. ఇరుక్కుపోయి!
మూడు నెలల క్రితం వెలువడిన నోటిఫికేషన్ ఆధారంగా ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని జనరల్‌కు కేటాయించారని తెలియగానే నియోజకవర్గంలో అనేక మంది పోటీ పడ్డారు. చివరకు రుద్రవరం మండలానికి చెందిన ఓ బీసీ నాయకుడు రూ.70 లక్షలు ‘బీ’ ట్యాక్స్ కడతానని ముందుకు రావడంతో పాటు ముందుగా రూ. 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే వైస్ చైర్మన్‌గా దొర్నిపాడు మండలానికి చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత రూ. 12 లక్షలకు మాట్లాడుకుని రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు సమాచారం. వీరితో పాటు అనేక మంది డైరెక్టర్ల పదవి కావాలనే వారు ఒక్కొక్కరు కనిష్టంగా రూ. 2 లక్షల నుంచి గరిష్టంగా రూ. 6 లక్షల వరకు బేరం మాట్లాడుకుని కొందరు అడ్వాన్స్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీరంతా తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ, జనసేన నేతల మధ్య విభేదాల