
ఏఐఐబీ పనుల పూర్తికి త్వరలో నిధులు
కర్నూలు(అర్బన్): జిల్లాలో ఏషియన్ ఇన్‌ఫ్రాక్ట్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు(ఏఐఐబీ ) ఆధ్వర్యంలో చేపట్టిన పనుల పూర్తి త్వరలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని, వివిధ కారణాలతో నిలిచిపోయిన పనులను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని పీఆర్ ఎస్‌ఈ వి.రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన తన చాంబర్‌లో కర్నూలు, నంద్యాల, ఆదోని ఈఈ, డీఈఈలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు ఏఐఐబీ నిధులతో మొత్తం 139 పనులు మంజూరు కాగా, వీటిలో వివిధ కారణాల వల్ల 29 పనులు డ్రాప్ అయ్యాయన్నారు. మిగిలిన 110 పనుల్లో ఇప్పటి వరకు 76 పూర్తి కాగా, మిగిలిన 34 పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇందులో రూ.24 కోట్ల అంచనాతో ప్రారంభించిన గోరంట్ల బ్రిడ్జి పనులు ఇప్పటి వరకు దాదాపు 15 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉందన్నారు. మొత్తం 34 పనులకు అవసరమైన రూ.96 కోట్లు విడుదలవుతాయని, ఎప్పటిలోగా వీటిని పూర్తి చేస్తారో తెలపాలన్నారు. నిధులు విడుదలైతే రోడ్లకు సంబంధించిన అన్ని పనులను మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఇంజనీర్లు స్పష్టం చేశారు. ఇంజనీర్ల అభిప్రాయాలను ఈఎన్‌సీ కార్యాలయానికి పంపుతామని ఎస్‌ఈ తెలిపారు. సమావేశంలో ఈఈలు సీఎస్‌సీ మద్దన్న, బీసీ వెంకటేష్, రఘురామిరెడ్డి, డీఈఈలు బండారు శ్రీనివాసులు, రవీంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి, నాగిరెడ్డి, లక్ష్మినారాయణ, మల్లికార్జున, రమేష్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పీఆర్ డీఈ, డీఈఈల సమీక్షలో
ఎస్‌ఈ రామచంద్రారెడ్డి