
శ్రీశైలండ్యాం గేట్ల మూసివేత
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో తెరచి ఉంచిన ఒక రేడియల్ క్రస్ట్‌గేటును మంగళవారం ఉదయం మూసివేశారు. జలాశయానికి భారీగా వరద వస్తుందని ఈనెల 8వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా మూడు క్రస్ట్ గేట్లను 10 అడుగులకు తెరచి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల ప్రారంభించారు. కృష్ణా బేసిన్‌లో వారం రోజులపాటు వరద ప్రవాహం భారీగా ఉండడడం, తర్వాత రోజురోజుకు తగ్గిపోతుండడంతో తెరచి ఉంచిన మూడు గేట్లలో రెండింటిని గత శనివారం ఉదయం రెండు గేట్లను మూసివేశారు. సోమవారం నుంచి మంగళవారం వారం వరకు ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి 70,111 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలంకు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 1,17,102 క్యూసెక్కులను వదిలారు. నాగార్జునసాగర్‌కు స్పిల్‌వే ద్వారా 27,127 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన అనంతరం 69,375 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 20,000 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్కులను వదిలారు. మంగళవారం సాయంత్రానికి జలాశయంలో 200.1971 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 882.20 అడుగులకు చేరుకుంది.
ఐటీఐలో రెండో విడత ప్రవేశాలకు గడువు పొడిగింపు
నంద్యాల(న్యూటౌన్): నంద్యాల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో రెండో విడత ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన విద్యార్థులు ఈనెల 20వ తేదీ లోపు iti. ap. gov. in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూలై 22వ తేదీలోపు నంద్యాల ప్రభుత్వ ఐటీఐలోనే సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. 23వ తేదీన ఉదయం 10గంటలకు నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ప్రిన్సిపాల్ కోరారు. పదవ తరగతి పాస్, ఫెయిల్ అయిన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఒక సంవత్సరం కోర్స్‌లు మెకానికల్ డీజిల్, వెల్డర్, రెండేళ్ల కోర్సులు డ్రాఫ్ట్‌మెన్ సివిల్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, రెఫ్రిజేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ టెక్, కోర్స్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. మరింత సమాచారం కోసం 9866022451ను సంప్రదించాలన్నారు.
చైన్నె కాలువకు నీరు విడుదల
వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మంగళవారం చైన్నె కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.75 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 13,500 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. వెలుగోడు రిజర్వాయర్ నుం,ఇ కింది ప్రాంతంలో ఉన్న రిజర్వాయర్లతో పాటు చైన్నె వాసులకు తాగునీటి కోసం నీటిని సరఫరా చేస్తున్నారు.
రుద్రవరం పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
రుద్రవరం: మేజర్ పంచాయతీ రుద్రవరం గ్రేడ్–1 కార్యదర్శి సుబ్బారావుపై వేటు పడింది. మేజర్ పంచాయతీకి సంబంధించిన రూ.2.13 కోట్లకు లెక్కలు లేక పోవడంతో పంచాయతీ రాజ్‌శాఖ ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేసినట్లు ఎంపీడీఓ భాగ్యలక్ష్మి మంగళవారం తెలిపారు. ఆ నిధులకు సంబంధించి పంచాయతీ తీర్మానాలు, ఎంబుక్కులు, ఇతర రికార్డులు ఏవీ లేకుండా ఫేక్ ఓచర్లు చూపించడంతో ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
రేపు సీఎం చంద్రబాబు రాక
నందికొట్కూరు: హంద్రీనీవా కాల్వకు నీటిని విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 17వ తేదీన మల్యాలకు రానున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. మల్యాల ఎత్తిపోతల వద్ద హంద్రీనీవా ప్రాజెక్టు మోటార్లు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వారి వెంట ఎమ్మెల్యే జయసూర్య, జేసీ విష్ణుచరణ్, ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం శర్మ తదితరులు ఉన్నారు.

శ్రీశైలండ్యాం గేట్ల మూసివేత