
విద్యార్థులకు సరిపడా రేషన్ ఇవ్వడం లేదు
పాణ్యం: పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సరిపడా రేషన్ ఇవ్వడం లేదని జేసీ విష్ణు చరణ్‌కు వంట ఏజెన్సీ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. బలపనూరు ప్రభుత్వ పాఠశాలలో గురువారం మెగా పీటీఎం కార్యక్రమం నిర్వహించారు. సమావేశం జరుగుతుండగానే రేషన్ ఇవ్వడం లేదని వంట ఏజెన్సీ నిర్వాహకులు జేసీకి ఫిర్యాదు చేయడంతో స్టాక్ రూమ్‌కు వెళ్లి పరిశీలించారు. రెండు బ్యాగ్‌ల రేషన్ ఉండడంతో హెచ్‌ఎం నారాయణపై జేసీ మండిపడ్డారు. పాతవి 25 బస్తాల వరకు బియ్యం నిల్వ ఉన్నాయని, వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా.. తమ్మరాజుపల్లె పాఠశాలలో, ఏపీ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరు చరిత హాజరయ్యారు.