
‘గురు’ వైభవం
గురు పౌర్ణమి కావడంతో శ్రీమఠంలో గురువారం భక్తుల రద్దీ కనిపించింది. రాఘవేంద్రుల మూల బృందావనానికి పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీమఠంలో వెండి రథోత్సవం కనుల పండువగా సాగింది. శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. – మంత్రాలయం రూరల్
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీని గ్రామీణ స్థాయిలో బలోపేతం చేయడానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామీణ స్థాయిల్లో నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ విస్తృతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంతకు మించి పథకాలను ప్రజలకు అందించారన్నారు. పార్టీ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు అని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశారన్నారు. కొత్త పింఛన్ల మంజూరు విషమే మరచిపోయారన్నారు. సమావేశంలో నంద్యాల మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీలు రేగటి రాజశేఖర్‌రెడ్డి, బుగ్గన నాగభూషణంరెడ్డి, గోకుల లక్ష్మి, మున్సిపల్ చైర్మన్‌లు సప్తశైల రాజేష్, చలంరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు బద్దల రాజకుమార్, శివలక్ష్మీ, వలంటీర్ జిల్లా విభాగం అధ్యక్షుడు పోస్టు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ బలోపేతం

‘గురు’ వైభవం

‘గురు’ వైభవం