నాడు
నేడు
‘సార్.. రోడ్డుకు మరమ్మతులు చేయండి’ అంటూ అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఇంకెన్నాళ్లు ఈ దార్రిద్యం అంటూ మదనపడ్డారు. చివరకు చందాలు వేసుకుని మరమ్మతులు చేసుకున్నారు. పేరూరు పంచాయతీకి మజరా గ్రామమైన బి.నాగిరెడ్డిపల్లెకు వెళ్లాలంటే గుంతల దారిలో వెళ్లాల్సిందే. వర్షం కురిస్తే గుంతల్లో నీరు నిలిచి వాహనాలు ముందుకు వెళ్లని పరిస్థితి దాపురిస్తుంది. సమస్యను అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో గ్రామంలోని రైతులందరూ ఒక్కటయ్యారు. తోచినంతగా చందాలు వేసుకున్నారు. పోగైన సొమ్ముతో మట్టి తోలించి రోడ్డుపై గుంతలను పూడ్చి చదును చేశారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా ముళ్ల పొదలను తొలగించారు. – రుద్రవరం
రైతులు రోడ్డేశారు!