
ప్రతిభకు మార్కులు కొలమానం కాదు
వెలుగోడు: విద్యార్థి ప్రతిభకు మార్కులు కొలమానం కానే కాదని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మార్కుల ఆధారంగా వారి తెలివితేటలను కొలవకూడదన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివితే దేనినైనా సాధించవచ్చని సూచించారు. వెలుగోడు పట్టణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఈవెంట్ 2.0 కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని సూంచారు. విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. పాఠశాలలో మెట్లు నిర్మించాలని జిల్లా కలెక్టర్‌కు పూర్వ విద్యార్థులు విన్నవించారు.