
గురు పౌర్ణ్ణమి.. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజి
వచ్చారు.. వెళ్లారు!
ఇది ఆర్. కృష్ణాపురం ప్రాథమిక పాఠశాల. ఇందులో 82 మంది విద్యార్థులు ఉన్నారు. గురువారం నిర్వహించిన సమావేశానికి 42 మంది విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చారని రిజిస్టర్‌లో సంతకాలు ఉన్నాయి. ఉదయం 10.30 గంటలకే సమావేశాన్ని ముగించినట్లు చెప్పారు. మళ్లీ భోజనానికి వస్తామని తల్లిదండ్రులు అంతా వెళ్లి పోయినట్లు ఉపాధ్యాయులు చెప్పారు.
‘తల్లికి వందనం’ రాలేదు
ఆర్‌కృష్ణాపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయులను తమకు తల్లికి వందనం రాలేదని విద్యార్థుల తల్లులు నిలదీశారు. సమావేశానికి వచ్చిన 6వ తరగతి విద్యార్థిని రమణమ్మ తల్లి సుబ్బలక్షమ్మ, 7వ తరగతి విద్యార్థిని జ్యాన్సి తల్లి లావణ్య తమ పిల్లలకు తల్లివందనం రాలేదని ఉపాధ్యాయున్ని నిలదీశారు. త్వరలోనే రెండో విడత విడుదల చేస్తారని ఉపాధ్యాయుడు సముదాయించారు. కాగా 130 పేరెంట్స్ హాజరు కావల్సిన ఈ మీటింగ్‌కు కనీసం పది మంది కూడా హాజరు కాలేదు.