
రైతులు వేసే ప్రతి పంటకూ బీమా
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: రైతులు వేసే ప్రతి పంటకూ తప్పనిసరిగా బీమా చేయించాలని వ్యవసాయాధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో క్రాప్ ఇన్సూరెన్స్‌పై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. బీమా చేయిచేస్తే ప్రకృతి వైపరీత్యాలతో పంటలను నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. వాతావరణ అంశాల ఆధారంగా బీమా పరిహారం చెల్లిస్తారన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువుల సమస్య రానీయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, హార్టికల్చర్ ఏడీ నాగరాజు, ఎల్‌డీఎం రవీంద్ర కుమార్, అగ్రికల్చర్ ఏఓలు, ఉద్యానవన శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పచ్చి మిర్చి కిలో రూ.120
జూపాడుబంగ్లా: ఒక్కసారిగా కూరగాయల ధరలు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం జూపాడుబంగ్లాలో వారాంతపు సంత నిర్వహించారు. పచ్చిమిర్చి కిలో ధర రూ.120 పలికింది. కిలో టమాటా రూ.40, కిలో వంకాయ, ఆలుగడ్డ రూ.40 ప్రకారం అమ్మారు. మిగతా కూరగాయల ధరలు రూ.40 అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. వారానికి సరిపడా కూరగాయలు కొనుగోలు చేసేందుకు రూ.300 నుంచి రూ.400 వెచ్చించాల్సి వచ్చిందని ప్రజలు పేర్కొన్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
గోస్పాడు: లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా క్రిమినల్ చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ హెచ్చరించారు. శుక్రవారం పీసీ అండ్ పీయన్ డీటీ యాక్టు 1994 సలహా కమిటీ జిల్లా స్థాయీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ.. స్కానింగ్ సెంటర్లలో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు జరిపి నివేదికలు అందించాలన్నారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు అన్న సమాచారం అందించాలని, అలాంటివారు పేర్లను గోప్యంగా ఉంచనున్నట్లు తెలిపారు. అలాంటి సెంటర్లు గుర్తిస్తే, వారిపై నేరం రుజువైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఐఓ డాక్టర్ సుదర్శన్ బాబు, డెమో రవీంద్ర నాయక్, వైద్యాధికారులు పద్మజ, అరుణజ్యోతి, శ్రావణ్ కుమార్, ఎన్‌జీఓస్‌లు పాల్ రాజారావు, రామారావు, న్యాయవాది మోతీలాల్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

రైతులు వేసే ప్రతి పంటకూ బీమా

రైతులు వేసే ప్రతి పంటకూ బీమా