
బానకచెర్ల నుంచి నీరు విడుదల
పాములపాడు: బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి శుక్రవారం 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఏఈ దేవేంద్ర తెలిపారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరు నుంచి ఎస్‌ఆర్‌ఎంసీ ద్వారా 20,000 క్యూసెక్కుల నీరు బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు ఇన్‌ఫ్లో ఉందన్నారు. ఈ నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. తెలుగుగంగ(వీబీఆర్)కు 14,000, కేసీసీ ఎస్కేప్ చానల్‌కు 6,000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నామని, జీఎన్‌ఎస్‌ఎస్‌కు నీటి విడుదల చేయలేదని చెప్పారు.
వీబీఆర్‌లో 6 టీఎంసీల నీరు
వెలుగోడు: తెలుగుగంగలో అంతర్భాగమైన వెలుగోడు జలాశయంలోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. బానకచెర్ల క్రాస్ హెడ్ రెగ్యులేటర్ నుంచి 14 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రస్తుత జలశాయంలో 844.585 మీటర్ల వద్ద 6.811టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలుగుగంగ ఏఈఈ శివనాయక్ తెలిపారు. తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు.