
చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం
నంద్యాల: ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది కాలంగా చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని ఓ హోటల్‌లో బాబూ ష్యూరిటీ.. మోసం గ్యారెంటీపై నంద్యాల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులతో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ పోస్టర్‌ను వైఎస్సార్‌సీపీ నాయకులు విడుదల చేశారు. ఈ సమావేశానికి జిల్లా పార్లమెంట్ పరిశీలకురాలు కల్పలతారెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, రాష్ట మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. సూపర్‌సిక్స్ పథకాలు ఇవ్వకుండా ప్రజలను మోసగించిన తీరును ఇంటింటికీ వైఎస్సార్‌సీపీ క్యాడర్ వెళ్లి వివరించాలన్నారు. యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, బీసీలు అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది అని విమర్శించారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఎవరూ భయపడరని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని కాట సాని భరోసా ఇచ్చారు. గ్రామ, పట్టణ వార్డు స్థాయిలో వైఎస్సార్‌సీపీని సంస్థాగతంగా పునర్ నిర్మాణం చేపట్టాలన్నారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్‌ను ప్రతి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో స్కాన్ చేయించి బాబు మోసాలను ఎండగట్టాలన్నారు. మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషాలు మాట్లాడుతూ.. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలు గురించి కార్యకర్తలు, నాయకులు వివరించాలన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
● కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నిసా, మాజీ చైర్‌పర్సన్ దేశం సులోచన, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళారెడ్డి, రాష్ట్ర ముస్లిం మైనార్టీ మాజీ సలహాదారుడు డీఎస్ హబీబుల్లా, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్‌మిల్ అమీర్‌బాషా, సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పురుషోత్తమరెడ్డి, దేశం సుధాకర్‌రెడ్డి, రాకేష్‌రెడ్డి, విజయశేఖర్‌రెడ్డి, ప్రహ్లాదరెడ్డి, నెరవాటి సత్యనారాయణ, బసవేశ్వరరెడ్డి, అనిల్‌అమృతరాజ్, రామసుబ్బయ్య, రసూల్ ఆజాద్, కారురవికుమార్, రమణ, గంగిశెట్టి శ్రీధర్, పాంషావలి, సాయిరాంరెడ్డి, మాధవరెడ్డి, ప్రతాపరెడ్డి, సైమాన్, శెట్టిప్రభాకర్ పాల్గొన్నారు.
ఇంటింటికెళ్లి క్యూఆర్ కోడ్‌తో
వివరిద్దాం
రెడ్ బుక్ రాజ్యాంగానికి
భయపడేది లేదు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కాటసాని రాంభూపాల్‌రెడ్డి

చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం