
తోడుకున్నోడికి తోడుకున్నంత!
కూటమి నేతల ఆశీస్సులు ఉంటే చాలు.. అనుమతులతో పనిలేదు. చలానాలు అసలే అక్కర్లేదు. తోడుకున్నోడికి తోడుకున్నంత. ఇదీ కౌతాళం మండలం గుడికంబాళి గ్రామ సమీపంలో ప్రభుత్వ ఇసుక రీచ్‌లోని దుస్థితి. ఇటీవల నదికి వరద నీరు రావడంతో అక్కడ అధికారికంగా ఇసుక రవాణాకు అనుమతులిచ్చారు. ఇదే అదునుగా చేసుకున్న కూటమి అనుకూల ట్రాక్టర్ల యజమానులు నదిలో వాలిపోయారు. తోడేళ్లుగా మారి ఇసుకనంతా తరలిస్తున్నారు. తమ ఆదాయ వనరుగా మార్చుకుని రీచ్‌లో అడ్డంకులకు తావు లేకుండా ఇసుకను దాటిస్తున్నారు. శనివారం గుడికంబాళి రీచ్ నుంచి వందలాది ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిపోతున్నా ఏ ఒక్క అధికారి అటు వైపు తొంగి చూడలేదు.
– మంత్రాలయం

తోడుకున్నోడికి తోడుకున్నంత!