
రూ.4.13 కోట్లు ఇంకా సర్దుబాటు కాలేదు
స్టాంప్ డ్యూటీ సర్దుబాటుకు సంబంధించి ప్రతి మండలంలో ఒక లైజనింగ్ అధికారికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగిస్తు చేసిన ప్రయత్నంతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.9,34,68,168లు సర్దుబాటు అయ్యాయి. అలాగే 2020–21లో రూ.4 కోట్లు, 2021–22లో 5 కోట్లు, 2022–23లో రూ.5.48 కోట్లు, 2023–24లో రూ.5.02 కోట్లు సర్దుబాటు అయ్యాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అపోర్షనేట్ అయిన మొత్తం రూ.4.13 కోట్లు ఇంకా సర్దుబాటు కాలేదు. స్టాంప్ డ్యూటీ స్థానిక సంస్థలకు సర్దుబాటు అయితే వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు కనీసం అపోర్షనేట్ కూడా చేయకపోవడం ఏమిటి? దీంతో జిల్లా పరిషత్‌కు ఎంత సర్దుబాటు చేయాలనే విషయంపై కూడా స్పష్టత కొరవడింది.
– ఎర్రబోతుల పాపిరెడ్డి, జెడ్పీ చైర్మన్
స్థానిక సంస్థలు
ఆర్థికంగా దెబ్బతింటున్నాయి
ప్రభుత్వ నిధులు సక్రమంగా విడుదల కాకపోవడంతో స్థానిక సంస్థలు ఆర్థికంగా నిర్వీర్యం అయిపోతున్నాయి. అంతంతమాత్రం ఆదాయం ఉన్న జిల్లా పరిషత్‌కు ఏడాది కాలంగా స్టాంప్ డ్యూటీ విడుదల కాకుంటే ఎలా? స్టాంప్ డ్యూటీ కింద స్థానిక సంస్థలకు విడుదలయ్యే 1.5 శాతం నిధులతో గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. అయితే ఈ నిధులను సర్దుబాటు చేయడంలో జరుగుతున్న జరుగుతున్న జాప్యాన్ని నివారించి వెంటనే నిధులు జెడ్పీకి జమ అయ్యేలా చూడాలి. – ఆర్‌బీ చంద్రశేఖర్‌రెడ్డి,
జెడ్పీటీసీ సభ్యుడు, గడివేముల
●

రూ.4.13 కోట్లు ఇంకా సర్దుబాటు కాలేదు