పీఎసీ సభ్యులుగా బుగ్గన, హఫీజ్‌ఖాన్‌ | - | Sakshi
Sakshi News home page

పీఎసీ సభ్యులుగా బుగ్గన, హఫీజ్‌ఖాన్‌

Apr 13 2025 2:13 AM | Updated on Apr 13 2025 2:13 AM

పీఎసీ

పీఎసీ సభ్యులుగా బుగ్గన, హఫీజ్‌ఖాన్‌

కర్నూలు(టౌన్‌): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా(పీఎసీ) మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి (డోన్‌), మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌(కర్నూలు) నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 మందికి చోటు లభించగా.. కమిటీలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి వీరిరువురికీ అవకాశం దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

మద్యపాన వ్యసన విముక్తి కేంద్రం ప్రారంభం

నందికొట్కూరు: పట్టణంలోని ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయం ఎదుట మద్యపాన వ్యసన విముక్తి కేంద్రాన్ని శనివారం నంద్యాల అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ వి.రాముడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యపానం, నాటుసారా, మత్తు కలిగించే పదార్థాలను సేవించడం వలన కలిగే నష్టాలను గురించి తెలుసుకోవాలన్నారు. వ్యసనాలను విముక్తి కలిగించేందుకే ఈ కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. మద్యం మత్తుకు బానిసైతే సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల డాక్టర్‌ రాజశేఖర్‌, ఎకై ్సజ్‌ శాఖ సీఐ రామాంజనేయులు నాయక్‌, ఎస్‌ఐలు జప్రూల్లా, శ్రీనివాసులు పాల్గొన్నారు.

భ్రామరీకి లక్ష కుంకుమార్చన

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల శ్రీభ్రమరాంబాదేవికి శనివారం పౌర్ణమిని పురస్కరించుకుని సాయంత్రం లక్ష కుంకుమార్చన సేవను శాస్త్రోక్తంగా జరిపించారు. శ్రీశైలానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో లక్ష కుంకుమార్చనలో భక్తులు పరోక్షసేవగా పాల్గొనే అవకాశం దేవస్థానం కల్పించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పరోక్షసేవలో పాల్గొన్నారు. మంగళకరమైన ద్రవ్యాలలో కుంకుమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కుంకుమ ద్రవ్యంతో అమ్మవారిని అర్చించడం విశేష ఫలదాయకమని పండితులు వివరించారు. లక్ష కుంకుమార్చన సేవను జరిపించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని, అభీష్టాలు సిద్ధిస్తాయని, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయన్నారు.

రేపటి ప్రజా సమస్యలపరిష్కార వేదిక రద్దు

నంద్యాల: ఈ నెల 14 తేదీ రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ప్రభుత్వ సెలవు కావడంతో కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి నిర్వహించడం లేదన్నారు.

నేడు ‘గురుకుల’ ప్రవేశ పరీక్ష

కర్నూలు(అర్బన్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ( 2025–26 ) 5వ తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 13న (నేడు) పరీ క్ష నిర్వహిస్తున్నట్లు గురుకులాల సమన్వయ కర్త డాక్టర్‌ ఐ.శ్రీదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లాలోని 8, నంద్యాల జిల్లాలోని 6 పరీక్షా కేంద్రాల్లో 5వ తరగతిలో 1,120 సీట్లకు 9340 మంది, ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 1,480 సీట్లకు 7,727 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు.

పీఎసీ సభ్యులుగా బుగ్గన, హఫీజ్‌ఖాన్‌ 1
1/3

పీఎసీ సభ్యులుగా బుగ్గన, హఫీజ్‌ఖాన్‌

పీఎసీ సభ్యులుగా బుగ్గన, హఫీజ్‌ఖాన్‌ 2
2/3

పీఎసీ సభ్యులుగా బుగ్గన, హఫీజ్‌ఖాన్‌

పీఎసీ సభ్యులుగా బుగ్గన, హఫీజ్‌ఖాన్‌ 3
3/3

పీఎసీ సభ్యులుగా బుగ్గన, హఫీజ్‌ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement