
కరోనాలో ప్రాణాలకు సైతం తెగించి..
కరోనా కష్టకాలంలో ప్రాణాలకు సైతం తెగించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇంటింటికీ రేషన్ డెలివరీ చేశారు. కరోనాకు భయపడి ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాలేని పరిస్థితుల్లో రేషన్ బండ్లు ఇంటి ముంగిటకు చేర్చి నిత్యావసరులు అందజేశారు. అలాగే కూటమి ప్రభుత్వంలో కూడా కృష్ణా జిల్లాలో వచ్చిన వరద బాధితులకు వరద నిధికి తమ జీతంలో 10 శాతం మొత్తం విరాళంగా ప్రకటించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సందర్భంగా 100 ఎండీయూ వాహనాల ద్వారా ఆహార పంపిణీ చేయించారు. అంగన్‌వాడీ, ఐసీడీఎస్‌లకు బియ్యం సరఫరా కార్యక్రమం కూడా వీళ్లే అదనంగా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మూడేళ్ల బకాయిలు ఇంత వరకు రాకపోవడం విచారకరం.