కొత్తపల్లి: ముసలిమడుగు సమీపంలో ఉన్న నల్లమల అడవికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. సోమవారం రాత్రంతా అడవిలో మంటలు కనిపించడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. మంగళవారం ఉదయం కూడా అడవిలో మంటలతో పాటు పొగ ఎగజిమ్ముతూనే ఉంది. గాలి ఏ దిశకు వీస్తుందో అటువైపుగా ఉవ్వెత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. బర్రెలు మేపుకునేందుకు గానీ, వంట కట్టెల కోసం గానీ ఎవ్వరిని అటవీలోకి వెళ్లకుండా ఫారెస్ట్ అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నప్పటికీ మంటలు ఎలా చెలరేగాయోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.