‘పది’లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి | - | Sakshi
Sakshi News home page

‘పది’లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

Mar 7 2025 9:35 AM | Updated on Mar 7 2025 9:31 AM

పగిడ్యాల: పదో తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం ఆయన ఆదర్శ పాఠశాల, స్థానిక జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో డీఈఓ మాట్లాడుతూ పబ్లిక్‌ పరీక్షలకు ఇంకా పది రోజులు సమయం ఉందన్నారు. ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఉపాధ్యాయుల సూచనలు, సల హాలు తప్పనిసరిగా పాటించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. డీ– గ్రేడ్‌ విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత (అడాప్ట్‌) తీసుకుని కనీసం ఉత్తీర్ణత అయ్యేలా చూడాలన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్లను తప్పనిసరిగా నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆయన వెంట ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ సుజన, జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్‌రావు తదితరులు ఉన్నారు.

568 మంది విద్యార్థులు గైర్హాజరు

నంద్యాల(న్యూటౌన్‌): జిల్లాలో ఇంటర్‌మీడియెట్‌ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన మ్యాథ్స్‌, బోటనీ, సివిక్స్‌ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షకు జనరల్‌ విద్యార్థులు 15,583 మందికి గాను 15,015 మంది హాజరు కాగా 568 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్‌ విద్యార్థులు 1,529 మందికి గాను 1,418 మంది హాజరు కాగా 111 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో అన్ని కేంద్రాల్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల పర్యవేక్షణలో ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు డీఐఈఓ సునీత తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం

నంద్యాల(అర్బన్‌): టైలరింగ్‌లో ఉచిత శిక్షణకు సంబంధించి జిల్లాలోని బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, కాపు(బలిజ) కులాల మహిళల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం కార్యనిర్వాహణ సంచాలకులు జాకీర్‌హుసేన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ అనంతరం కుట్టుమిషన్‌ ఇవ్వబడుతుందని చెప్పారు. 18 నుంచి 50ఏళ్లలోపు మహిళలు సచివాలయాలు, మండల, మున్సిపల్‌ కార్యాలయాల ద్వారా https:apobmms.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్‌, రేషన్‌కార్డు, మొబైల్‌ నెంబరు కావాల్సి ఉంటుందని, మరింత సమాచారానికి సెల్‌ : 9908132030ను సంప్రదించవచ్చని చెప్పారు.

ఆత్మకూరులో భగభగ

40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలో గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోనే అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి మొదటి వారంలోనే భాను డు ఉగ్రరూపం దాల్చుతుండగా ఇక ఏప్రిల్‌, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజ లు భయాందోళన చెందుతున్నారు. ప్రజలు ఎండ వేడిమికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. మార్చి ప్రారంభంలో ఈ తరహా ఎండలు ఎప్పుడూ చూడలేదని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

‘పది’లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి 1
1/1

‘పది’లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement