
శ్రీశైల దేవస్థానానికి రూ.5లక్షల విరాళం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ పథకాలకు గురువారం హైదరాబాద్‌కు చెందిన ఎం.శివాజీ రూ.5 లక్షల విరాళాన్ని అందించారు. అన్నప్రసాద వితరణకు రూ. 2 లక్షలు, గో సంరక్షణ నిధి పథకానికి రూ.2లక్షలు, ప్రాణదాన ట్రస్ట్‌కు రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు హిమబిందుకు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు రసీదు, లడ్డూ ప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రం అందజేసి సత్కరించారు.
భూరీసర్వేలో
పొరపాట్లకు తావివ్వొద్దు
బనగానపల్లె రూరల్: మండలంలో జరుగుతున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని సర్వేయర్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అన్నారు. గురువారం తిమ్మాపురం గ్రామంలో భూముల రీసర్వే పనులను జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ముందుగా సమాచారం ఇచ్చి రీసర్వే చేయాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. రీసర్వే సమయంలో సర్వేయర్లు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆయన వెంట తహసీల్దార్ నారాయణరెడ్డి, ఆర్‌ఐ ప్రవీణ్‌నాయక్ తదితరులు ఉన్నారు.
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో భక్తుల సందడి నెలకొంది. గురువారం ప్రత్యేకం కావడంతో రాఘవేంద్రస్వామి దర్శనార్థం భక్తులు వేలా దిగా తరలివచ్చారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో రావడంతో మంత్రాలయ క్షేత్రం కళకళలాడింది. తుంగభద్ర నదికి వరద నీరు రావడంతో నదీతీరంలో భక్తుల కోలాహలం కనిపించింది. భక్తులు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ, తర్వాత రాఘ వేంద్రుల మూల బృందావన దర్శనాలు చేసుకున్నారు. రాఘవేంద్రుల దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టింది.

శ్రీశైల దేవస్థానానికి రూ.5లక్షల విరాళం

శ్రీశైల దేవస్థానానికి రూ.5లక్షల విరాళం