అహోబిలం.. బ్రహ్మోత్సవ వైభవం | - | Sakshi
Sakshi News home page

అహోబిలం.. బ్రహ్మోత్సవ వైభవం

Mar 6 2025 1:36 AM | Updated on Mar 6 2025 1:33 AM

సింహవాహనంపై దర్శనమిచ్చిన

జ్వాలా నరసింహస్వామి

సింహవాహనంపై ఊరేగుతున్న జ్వాలా నరసింహ స్వామి

ఆళ్లగడ్డ: శ్రీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు నాంది పులుకుతూ దిగువ అహోబిలంలో అంకురార్పణ కార్యక్రమాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పది రోజుల పాటు ఎటువంటి ఆటంకాలు లేకుండా క్రతువులు జరగాలని శాస్త్రోక్తంగా విశ్వక్సేనుడికి అహోబిల మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌, వేదపండితులు, అర్చకులు ఆరాధన చేశారు. అనంతరం తిరుమంజనం, స్వస్తివచనంతో పాటు ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా ముస్తాబుచేసి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేశారు. వైష్ణవ ఆచారం ప్రకారం రాత్రివేళ వేదమంత్ర పఠనాలతో మృత్యుంగ్రహణం పర్వాన్ని చేపట్టారు. అనంతరం ఈశాన్యంలోని పుట్టమన్ను తెచ్చి నవధాన్యాలను నాటి బ్రహ్మోత్సవాలకు నాంది పలికారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారు జామున దిగువ అహోబిలంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. అనంతరం భేరీ పూజ, రాత్రి సింహ వాహన సేవలు కొనసాగుతాయి.

ఎగువ అహోబిలంలో..

బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుత్మంతుని చిత్రపటావిష్కరణ చేశారు. బుధవారం రాత్రి జ్వాలా నరసింహస్వామి సింహవాహనంపై అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. సింహహనంపై కొలువైన స్వామికి అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు.

అహోబిలం.. బ్రహ్మోత్సవ వైభవం1
1/2

అహోబిలం.. బ్రహ్మోత్సవ వైభవం

అహోబిలం.. బ్రహ్మోత్సవ వైభవం2
2/2

అహోబిలం.. బ్రహ్మోత్సవ వైభవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement