నేడు ప్రజా ఫిర్యాదులపరిష్కార వేదిక కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రజా ఫిర్యాదులపరిష్కార వేదిక కార్యక్రమం

Mar 3 2025 1:47 AM | Updated on Mar 3 2025 1:47 AM

నేడు ప్రజా ఫిర్యాదులపరిష్కార వేదిక కార్యక్రమం

నేడు ప్రజా ఫిర్యాదులపరిష్కార వేదిక కార్యక్రమం

నంద్యాల: కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్‌ గ్రివెన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టమ్‌ (పీజీఆర్‌ఎస్‌) ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారు. ఉదయం 9.30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరు కావాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్‌ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

విద్యార్థులకు సంస్కారం అవసరం

జిల్లా జడ్జి జి.కబర్ది

కర్నూలు కల్చరల్‌: విద్యార్థులకు చదువే కాదు సంస్కారం కూడా అవసరమని జిల్లా జడ్జి జి.కబర్ది అన్నారు. ఆదివారం ఓల్డ్‌సిటీ చిదంబరావు వీధిలోని స్వామి వివేకానంద సంస్కృత పాఠశాలలో అన్నపూర్ణమ్మ విద్యార్థి వసతి గృహం వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువు, సంస్కారం అందించడం అభినందనీయమన్నా రు. హైదరాబాద్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ క్షేత్ర సేవా ప్రముఖ్‌ ఎక్కా చంద్రశేఖర్‌ ముఖ్య వక్తగా హాజరై సందేశమిచ్చారు. పారిశ్రామికవేత్త శేరి బాలనాగరాజు, ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ్‌ కార్యసభ్యులు సుబ్బ లక్ష్మయ్య, వసతి గృహం అధ్యక్షులు బి.చిరంజీవిరెడ్డి, కార్యదర్శి కె.బాలాజీరావు మాట్లాడారు.

మోతాదుకు మించిపురుగు మందులు వాడొద్దు

కర్నూలు(అగ్రికల్చర్‌): మోతాదుకు మించి పురుగు మందులు పిచికారీ చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని ఇన్‌పుట్‌ డీలర్లను ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీలత సూచించారు. కలెక్టరేట్‌లోని వ్యవసాయ శాఖ సమావేశ మందిరంలో ఆదివారం ఇన్‌పుట్‌ డీలర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మ డీపీడీ మాట్లాడుతూ.. పురుగుమందులు ఎక్కువ గా వాడుతుండటంతో ఆహార పంటలు, కూరగాయల్లో వాటి అవశేషాలు ఉంటున్నట్లు స్పష్టమవుతోందన్నారు. విశ్రాంత జేడీఏ, దేశీ శిక్షణ కార్య క్రమం సమన్వయకర్త జయచంద్ర పాల్గొన్నారు.

‘ఎకై ్సజ్‌’ సంఘం అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్‌

కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఎగ్జిక్యూటీవ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కర్నూలుగా ఈఎస్‌టీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ ఎన్నికయ్యారు. ఆదివారం కర్నూలు ఎకై ్సజ్‌ కార్యాలయం ఆవరణలో జిల్లా డీపీఈఓ మచ్చా సుధీర్‌బాబు అధ్యక్షతన ఎన్నిక లు జరిగాయి. అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా సోమశేఖర్‌ (డోన్‌ ఎస్‌ఐ), ఉపాధ్యక్షులుగా భార్గవ్‌రెడ్డి (కోసిగి ఎస్‌ఐ), ప్రధాన కార్యదర్శిగా సందీప్‌ (కోవెలకుంట్ల ఎస్‌ఐ), ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా రమేష్‌రెడ్డి (ఎమ్మిగనూరు సీఐ), సహాయ కార్య దర్శిగా రహెనాబేగం (కర్నూలు ఎస్‌ఐ), కోశాధికారిగా దుర్గా నవీన్‌బాబు (కర్నూలు ఎస్‌ఐ), కార్యవర్గ సభ్యులుగా ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్‌, రమాదేవి, శేషాచలం, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్‌కుమార్‌ నాయక్‌, ఇంద్ర కిరణ్‌ తేజ ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి సుధీర్‌బాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement