
నిందితులను అరెస్ట్ చూపుతున్న ఎస్‌ఐ మల్లికార్జున
తుగ్గలి: పశువులు, కరెంటు సామగ్రి దొంగలించుకుపోయిన దొంగలను తుగ్గలి పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇటీవల తుగ్గలిలో వామిదొడ్డిలో కట్టేసిన నాలుగు ఎద్దులు, విద్యుత్తు సబ్‌స్టేషన్లో విద్యుత్తు వైరును వేర్వేరుగా రాత్రి సమయాల్లో దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎట్టకేలకు విద్యుత్తు సబ్‌స్టేషన్ సమీపంలోని ఎద్దులదొడ్డి రస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించి చోరీ విషయం రాబాట్టారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పోతురాయికి చెందిన సాకే బాలన్న, ముకుందాపురం ఎరుకలి మల్లికార్జున, పొరల్లకు చెందిన ఎరుకలి చిన్న గంగన్న, ముంటిమడుగు పలాజి సుధాకర్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1,90,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జున చెప్పారు. కేసు ఛేదించిన కానిస్టేబుళ్లు షబ్బీర్ బాషా, వినోద్‌లను ఎస్‌ఐ అభినందించారు.