స్వరాష్ట్రంలో మారిన జిల్లా రూపురేఖలు | - | Sakshi
Sakshi News home page

స్వరాష్ట్రంలో మారిన జిల్లా రూపురేఖలు

Jun 2 2026 5:53 AM | Updated on Jun 2 2026 5:53 AM

మెరుగైన వైద్య సేవలు పెరిగిన తలసరి ఆదాయం

నల్లగొండ

సాగు, తాగునీటి ప్రాజెక్టులకు అడుగులు.. ఫ్లోరోసిస్‌ పీడకు విముక్తి

రికార్డు స్థాయిలో పెరిగిన వరి సాగు.. ధాన్యం దిగుబడిలో అగ్రగామి

మెడికల్‌ కళాశాల, ఏరియా ఆస్పత్రుల అప్‌గ్రేడ్‌తో మెరుగైన వైద్యం

గురుకులాలతో పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య

యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌తో విద్యుత్‌ వెలుగులు

ఇక్కడ ఒకప్పుడు ఎండిపోయిన చేలు, అర్ధరాత్రి కరెంట్‌ కష్టాలు, అన్నింటికీ మించి ఫ్లోరోసిస్‌ మహమ్మారితో ఒక తరం నలిగి

పోయింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక.. నల్లగొండ చరిత్ర కొత్త మలుపు తిరిగింది.

విద్యా, వైద్య, వ్యవసాయ, సాగునీటి రంగాల్లో అసాధారణ ప్రగతి సాధించింది. ఫ్లోరైడ్‌ రహిత జిల్లాగా మారడమే

కాకుండా.. పచ్చని పొలాలు, మెడికల్‌ కాలేజీ, భారీ

పవర్‌ ప్లాంట్‌, ధాన్యం దిగుబడిలో రికార్డు ఇప్పడు

నల్లగొండ సొంతం.

నల్లగొండ టౌన్‌ : తెలంగాణ రాష్ట్ర ఆవర్భావం తరువాత జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. నల్లగొండలో మెడికల్‌ కళాశాల, నర్సింగ్‌ కళాశాల ఏర్పాటుతో వైద్యులు, నర్సింగ్‌ స్టాఫ్‌ సంఖ్య గణనీయంగా పెరిగింది. మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. జీజీహెచ్‌ను 400 పడకల స్థాయి నుంచి 700 పడకలకు పెంచారు. దాంతో పాటుగా మిర్యాలగూడ, దేవరకొండ ఏరియా ఆస్పత్రులను 100 నుంచి 200 పడకలకు, నకిరేకల్‌ ఆస్పత్రినిన 50 నుంచి వంద పడకలకు, మర్రిగూడ ఆస్పత్రిని 30 నుంచి 48 పకడలకు హాలియా పీహెచ్‌సీని 30 పడకలకు పెంచారు. దీంతో పాటుగా పల్లె దవఖానాలను, బస్తీ దావఖానాలను ఏర్పాటు చేశారు.

● జిల్లాలోని జీజీహెచ్‌తో పాటుగా మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్‌, నకిరేకల్‌, మర్రిగూడ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి కిడ్నీ రోగులకు డయాలసిస్‌ సేవలను అందిస్తున్నారు.

● హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిపై నకిరేకల్‌లో, అద్దంకి జాతీయ రహదారిపై మిర్యాలగూడలో, నాగార్జునసాగర్‌ జాతీయ రహదారిపై మాల్‌లో, నాగార్జునసాగర్‌లో ట్రామాకేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు.

నల్లగొండ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు వ్యవసాయాధారిత జిల్లాగా ఉన్న నల్లగొండ సాగునీటి విస్తరణ, పారిశ్రామికాభివద్ధి, ిిస్తిరాస్థి వ్యాపారం, సేవారంగం పెరుగుదలతో తలసరి ఆదాయంలో గణనీయమైన పురోగతి సాధించింది. వ్యవసాయం, పాల ఉత్పత్తి, పరిశ్రమలు, సేవారంగం, స్థిరాస్తి వ్యాపారం తలసరి ఆదాయంలో మూడు రెట్లకు పైగా పెరుగుదల తెలంగాణ ఏర్పడిన తొలి సంవత్సరాల్లో నల్లగొండ జిల్లా తలసరి ఆదాయం లక్ష రూపాయలలోపే ఉండేది. ప్రస్తుతం రూ.2.62 లక్షలకు పైగా చేరింది.

– సాక్షి నెట్‌వర్క్‌

Advertisement
 
Advertisement
Advertisement