నల్లగొండ నగరం పరిధిలోని చర్లపల్లి చెందిన దివ్యాంగుడు ఏర్పుల మారయ్య (70) తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం నల్లగొండ కలెక్టరేట్‌కు వచ్చి గోడు వెల్లబోసుకున్నాడు. చర్లపల్లిలో రూ.వెయ్యి అద్దె చెల్లించి తన తల్లి ఈదమ్మ (90)తో కలిసి జీవిస్తున్నానని చెప్పాడు. ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా.. ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వృద్ధుడు, దివ్యాంగుడైన మారయ్య కలెక్టర్‌ను కలవడానికి ఆటోలో వచ్చేందుకు రూ.200, తిరిగి వెళ్లేందుకు మరో రూ.200 ఖర్చు చేశారు. కలెక్టరేట్ మెట్లు ఎక్కడం కూడా కష్టంగా మారినా, ఇతరుల సహాయంతో పైకి చేరుకుని వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశాడు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ


