నేడు పరేడ్‌ గ్రౌండ్‌లో పతాకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

నేడు పరేడ్‌ గ్రౌండ్‌లో పతాకావిష్కరణ

Jun 2 2026 5:53 AM | Updated on Jun 2 2026 5:53 AM

నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం నల్లగొండలో నిర్వహించే వేడుకలకు అంతా సిద్ధమైంది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 7.45 గంటలకు క్లాక్‌టవర్‌ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం, ఉదయం 8 గంటలకు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వేడుకల్లో విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన, ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాల ప్రదానం చేస్తారు. పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లను అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ సోమవారం రాత్రి పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement