నల్లగొండ అగ్రికల్చర్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జిల్లాలో వరిసాగు గణనీయంగా పెరిగింది. కోటీ 30లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి సాధించి ధాన్యాగారంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2017లో వానాకాలంలో వరి 1,59,152 ఎకరాల్లో, పత్తి 5,83,800 ఎకరాలు, ఇతర పంటలు కలిపి మొత్తం 8,41,745 ఎకరాల్లో మాత్రమే రైతులు సాగు చేశారు. 2025 వానాకాలంలో వరి 5,41,570 ఎకరాల్లో పత్తి 5,82,062 ఎకరాలు ఇతర పంటలు కలిపి మొత్తం 11,95,601 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఏడాది రెండు సీజన్లకు నాగార్జునసాగర్ ఎడమకాలువ, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, మూసీ కాలువల ద్వారా సాగు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రధాన కాలువ పరిధిలోని గ్రామాలోని చెరువులు జలసిరులు సంతరించుకుంటున్నాయి.


