పోలీసులకు సేవా పతకాలు | - | Sakshi
Sakshi News home page

పోలీసులకు సేవా పతకాలు

Jun 2 2026 5:53 AM | Updated on Jun 2 2026 5:53 AM

నల్లగొండ : ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకాలను ప్రటించింది. ఏఆర్‌ ఎస్‌ఐ జయరాజ్‌కు ఉత్తమ సేవా పతకం, 12 బెటాలియన్‌ ఏఆర్‌ ఎస్‌ఐ బి.వెంకట్‌రెడ్డి, డీఎస్‌పీ సెల్‌లో పనిచేస్తున్న రఫియోద్దీన్‌, సీసీఎస్‌ కానిస్టేబుల్‌ పుస్పగిరి, ఏఆర్‌ పీసీ అంజద్‌ఖాన్‌కు సేవా పతకాలకు ప్రకటించింది. తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా మంగళవారం వారు పతకాలు అందుకోనున్నారు.

బాధ్యతలు

స్వీకరించిన డీఈఓ

నల్లగొండ : నల్లగొండ డీఈఓగా బదిలీపై వచ్చిన సుశీందర్‌రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయం సిబ్బందితోపాటు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా వినోద్‌కుమార్‌

నల్లగొండ అగ్రికల్చర్‌ : జిల్లా వ్యవసాయాధికారిగా వి.వినోద్‌కుమార్‌ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని వ్యవసాయశాఖ కమిషనరేట్‌లో ఏడీఏగా పనిచేస్తూ పదోన్నతి పొంది నల్లగొండ జిల్లాకు బదిలీపై వచ్చారు. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఇన్‌చార్జి జిల్లా వ్యవసాయాధికారిగా పనిచేసిన పాల్వాయి శ్రవణ్‌కుమార్‌ పదోన్నతి పొంది వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌లో

46 ఫిర్యాదులు

నల్లగొండ : జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్‌ గ్రీవెన్స్‌ డేలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 46 మంది బాధితులు భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలు తదితర అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్‌ ఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీసింగ్‌ అందించడమే జిల్లా పోలీస్‌ శాఖ లక్ష్యమని ఎస్పీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement