పేదల సొంతింటి కల సాకారం | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల సాకారం

Jun 2 2026 5:53 AM | Updated on Jun 2 2026 5:53 AM

దేవరకొండ : పేదవాడి సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తోందని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. సోమవారం దేవరకొండ మండలంలోని శకృనాయక్‌తండా గ్రామంలో నిర్మించిన 6 ఇందిరమ్మ ఇళ్లలో ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌తో కలిసి లబ్ధిదారులత చేత గృహ ప్రవేశ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ గృహాలను త్వరితగతిన పూర్తి చేసి గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. ప్రతి కుటుంబం సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే బాలునాయక్‌ మాట్లాడుతూ తండాల్లో గుడిసెలు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గ్రామల్లో సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం, మౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రాజెక్టు భూసేకరణ అంశాలపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓ పద్మప్రియ, తహసీల్దార్‌ సంజీవ్‌కుమార్‌, ఎంపీడీఓ డానియల్‌, సర్పంచ్‌ మోహన్‌లాల్‌, రామ్‌సింగ్‌, పంచాయతీ కార్యదర్శి కీర్తి, లబ్దిదారులు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ చంద్రశేఖర్‌

దేవరకొండ మండలం శకృనాయక్‌తండా ఇందిరమ్మ గృహ ప్రవేశాలు

Advertisement
 
Advertisement
Advertisement