అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ | - | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ

Jun 2 2026 5:53 AM | Updated on Jun 2 2026 5:53 AM

రామగిరి(నల్లగొండ) : అమరుల త్యాగాల ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని, వారి త్యాగాలను ఎన్నటికీ మర్చిపోవద్దని ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. తెలంగాణ ఏర్పాటై పుష్కరకాలం పూర్తయిన సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని క్లాక్‌ టవర్‌ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల రాలేదని, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు దశాబ్దాల పాటు చేసిన పోరాటాలు, వేలాది మంది అమరుల ఆత్మబలిదానాల వల్లే వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారులు పందుల సైదులు, బోనగిరి దేవేందర్‌, చీర పంకజ్‌యాదవ్‌, దూసరి కిరణ్‌కుమార్‌, చింతమల్ల గురువయ్య, కె.పర్వతాలు, ఇందూరి సాగర్‌, ఆర్‌.విజయ్‌కుమార్‌, పి.ఏడుకొండలు, మల్లేశం. ఆర్‌. లక్ష్మయ్య, పెండెం ధనుంజయనేత, వెంకటేశ్వర్లు, బీవీ చారి, గద్దపాటి సురేందర్‌, కె.రత్నయ్య, సునీత, గూడూరి జానకిరామ్‌రెడ్డి, అయితగోని జనార్దన్‌గౌడ్‌, మాతంగి అమర్‌, బట్టు నవీన్‌, కొండేటి మురళి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement