ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

Jun 2 2026 5:53 AM | Updated on Jun 2 2026 5:53 AM

నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు 43, ఇతర శాఖలకు 75 మొత్తం 118 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులన్నీ జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. ‘జల్‌ సంచయ్‌ – జల్‌ భాగీదారి’ కార్యక్రమంలో నల్లగొండ రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలవడంనూ కలెక్టర్‌.. అధికారులను అభినందించారు. ఈనెల 1 నుంచి 5 వరకు ‘స్వచ్ఛ గావ్‌ సురక్ష జల్‌ వాయు’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 1 నుంచి 12 వరకు పర్యావరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీఎఫ్‌ఓ రాజశేఖర్‌, తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement
 
Advertisement
Advertisement