నల్లగొండ టూటౌన్ : ఇంజనీరింగ్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు ఏఐ ఆధారిత బీటెక్ ఎంతగానో ఉపయోగపడుతుందని ‘ఏఐ ప్రోఫ్’సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పైళ్ల సాయిచరణ్‌రెడ్డి అన్నారు. ఏఐ ప్రోఫ్ ఆధ్వర్యంలో నల్లగొండలోని ఐటీ టవర్‌లో ఆదివారం నిర్వహించిన ఇంజనీరింగ్ కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్‌కు ఆయన హాజరై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు దిశా నిర్దేశం చేశారు. నల్లగొండకు చంఎదిన సాందీప్ కోణం గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలన్న సంకల్పంతోనే ఈ ఇంజనీరింగ్ కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థుల ఆశలను నిజం చేస్తూ వారి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఏఐ ప్రోఫ్ దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు అజ్మీర భానుప్రకాష్, కోణం ఫౌండేషన్ ప్రతినిధులు స్నేత, నవ్య, శ్రీనివాస్, అంజి, పరశురామ్ తదితరులు పాల్గొన్నారు.


