డీఈఓ భిక్షపతి బదిలీ | - | Sakshi
Sakshi News home page

డీఈఓ భిక్షపతి బదిలీ

Jun 1 2026 7:17 AM | Updated on Jun 1 2026 7:17 AM

నల్లగొండ : నల్లగొండ జిల్లా విద్యా శాఖాధికారి బొల్లారం భిక్షపతి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లా డీఈఓ సుశీందర్‌రావు నల్లగొండకు రానున్నారు. డీఈఓ భిక్షపతి జిల్లాలో 6 సంవత్సరాల 7 నెలల పాటు ఆయన డీఈఓగా పని చేశారు. ప్రస్తుతం ఆయనను యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండలో ఇప్పటివరకు ఇంత సుదీర్ఘకాలం పాటు డీఈఓగా పని చేసిన వారు లేరు. భిక్షపతి డీఈఓగా జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. జాతీయ అవార్డులను అందుకున్నారు. ఈయన కాలంలో విద్యాశాఖలో రెండు పర్యాయాలు ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు జరిగాయి. 317 జీఓలో జరిగిన బదిలీల్లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా నిర్వహించి. ప్రజాప్రతినిధులతో, ఉపాధ్యాయ సంఘాలతో మన్ననలు పొందారు.

భూగర్భ జలాల

పెంపునకు కృషి చేయాలి

కట్టంగూర్‌ : భూగర్భ జలాల పెంపునకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జల్‌ సంచాయ్‌, జన్‌ భాగీదారి పనుల ఆన్‌లైన్‌ నమోదును ప్రక్రియను పరిశీలించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్షించి మాట్లాడారు. సమావేశంలో ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్‌రావు, ఎంపీఓ స్వరూపారాణి, సూపరింటెండెంట్‌ చలపతి, కార్యదర్శులు పెద్దయ్య, అశోక్‌, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

అగ్నివీర్‌కు ఎన్జీ కాలేజీ విద్యార్థులు ఎంపిక

రామగిరి(నల్లగొండ) : ఇండియన్‌ ఆర్మీ తాజాగా విడుదల చేసిన అగ్నివీర్‌ ఫలితాల్లో ఎన్జీ కళాశాల ఎన్‌సీసీ క్యాడెట్లు ఎంపికయ్యారు. కళాశాలకు చెందిన కె.మహేష్‌, కె.గణేష్‌, ఎస్‌.జయప్రకాశ్‌, పి.అనిల్‌, కె.మనోజ్‌కుమార్‌ కఠినమైన శారీరక, రాత పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి విజయం సాధించడంపై లెఫ్టినెంట్‌ సిహెచ్‌.సుధాకర్‌ ఆనందం వ్యక్తం చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో

విలీనం చేయాలి

రామగిరి(నల్లగొండ) : ఆర్టీసీ ఉద్యోగులను ఈ నెల 2వ తేదీన ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ నల్లగొండ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎన్‌ఆర్‌సి.రాజు, విఎస్‌.రెడ్డి, డిఎం.రెడ్డి, కెఎల్‌.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement