నల్లగొండ టౌన్ : పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఆదివారం నల్లగొండలోని సుభాష్ విగ్రహం వద్ద రైతు సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రం ఎరువుల ధరలను పెంచుతూ సబ్సిడీలు ఎత్తివేయడం వల్ల రైతులకు పెట్టుబడి పెరిగి రైతుల నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, కందాల ప్రమీల, రామచంద్రు, పండు వెంకటేశ్వర్లు, కోశాధికారి దుర్గయ్య, జక్కల నరసింహ, కార్యదర్శి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


