నేరాల నియంత్రణకు నిరంతర తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకు నిరంతర తనిఖీలు

Jun 1 2026 7:17 AM | Updated on Jun 1 2026 7:17 AM

నల్లగొండ : నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తారని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అన్నారు. ఆయన శనివారం అర్ధరాత్రి నల్లగొండలో నాకా బందీ నిర్వహించి వాహనాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించే లక్ష్యంతో అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో నాఖాబందీ నిర్వహించి వాహన తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. దాదాపు 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా 47 చెక్‌ పాయింట్లు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపట్టారని వెల్లడించారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్‌ రైడింగ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌, సైలెన్సర్లు మార్పు చేసిన వాహనాలు, నంబర్‌ ప్లేట్లు లేకుండా తిరిగే మొత్తం 738 వాహనాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలు నమోదు చేశారు.

ఫ ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌

Advertisement
 
Advertisement
Advertisement