‘సర్‌’ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ వేగవంతం చేయాలి

May 31 2026 4:41 AM | Updated on May 31 2026 4:41 AM

న్యూస్‌రీల్‌

పెళ్లి ఆగింది.. చదువులో మెరిసింది..

చిరుచేతుల్లో సృజనాత్మకత
మిర్యాలగూడలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరం కొనసాగుతోంది.
వాతావరణం
పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.

ఆర్థిక సాధికారతే లక్ష్యం

వికలాంగుల ఆర్థిక సాధికారతే లక్ష్యమని వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య అన్నారు.

- 8లో

శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026

జల సంరక్షణ అందరి బాధ్యత

పెద్దఅడిశర్లపల్లి : జల సంరక్షణ అందరి బాధ్యత అని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దఅడిశర్లపల్లి మండలంలోని తిరుమలగిరిలో జల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. ఆయన వెంట సర్పంచ్‌ బెల్లి కృష్ణమ్మఆంజనేయులు, ఎంపీడీఓ చంద్రమౌళి, ఎంపీఓ శేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం నల్లగొండలోని కలెక్టరేట్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. స్వచ్ఛమైన ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదిగా ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

నేడు ప్రత్యేక ప్రజావాణి

నల్లగొండ : నల్లగొండలోని కలెక్టరేట్‌లో శనివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశారన్ని దివ్యాంగులు, వృద్ధులకు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.

మీసేవ కేంద్రాల్లో వేగవంతమైన సేవలు

మాడుగులపల్లి : మీసేవ కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా సేవలు అందించాలని ఈడీఎం చల్లా దుర్గారావు అన్నారు. శుక్రవారం ఆయన మాడుగులపల్లి మండల కేంద్రంలోని మీసేవ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆన్‌లైన్‌ సేవలు, ధ్రువపత్రాలు, స్టేషనరీని పరిశీలించి.. కేంద్రంలో సేవలు సకాలంలో అందుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీసేవ కేంద్రాల్లో ప్రజలు చేశాక.. ప్రక్రియ పూర్తి కాగానే ఆన్‌లైన్‌లోనే నేరుగా ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్‌ అవుతుందన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ శివ, మీసేవ కేంద్రం నిర్వాహకులు ఉన్నారు.

పాలిసెట్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రారంభం

రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో పాలిసెట్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ శుక్రవారం ప్రారంభమైంది. మొదటి రోజు మొత్తం 340 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనట్లు కళాశాల కోఆర్డినేటర్‌ సీహెచ్‌.నరసింహారావు తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు అవసరమైన అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో సమయానికి హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది ఎ.వెంకటేశ్వర్లు, అజయ్‌కుమార్‌, నరేందర్‌, నజీమొద్దీన్‌, రవీంద్ర, వీరేశ్‌నాయక్‌, చంద్రశేఖర్‌, ఇద్దయ్య పాల్గొన్నారు.

స్తంభించిన ఆర్‌టీఏ సేవలు

నల్లగొండ : నల్లగొండలో ఆర్టీఏ సేవలు నిలిచిపోయాయి. పట్టణంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులు, వడగళ్ల వానతో కలెక్టరేట్‌ పక్కన ఉన్న ఆర్‌టీఏ కార్యాలయ రోడ్డులో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్‌ సరఫరా, ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. శుక్రవారం విద్యుత్‌ పునరుద్ధరణ జరగలేదు. దీంతో డీటీసీ వాణి ఆర్‌టీఏ కార్యాలయ సేవలను శుక్రవారం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం స్లాట్‌ బుకింగ్‌లు శనివారానికి వాయిదా వేసినట్లు తెలిపారు. శుక్రవారం ఆర్‌టీఏ సేవలు నిలిచిపోవడంతో లైసెన్స్‌లు, పిట్‌నెస్‌ ఇతర సేవల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారులు విద్యుత్‌ పునరుద్ధరణ పనులు చేపట్టారు.

చదువుకునే వయస్సులో బాలికలకు పెళ్లిళ్లు

ఆడపిల్లను భారంగా భావిస్తున్న తల్లిదండ్రులు

అధికారులు అడ్డుకుంటున్నా మారని తీరు

మూడు ముళ్లలో బందీ అవుతున్న బాల్యం

అడ్డుకున్న బాల్య వివాహాలు,

కేసుల వివరాలు..

సంవత్సరం అడ్డుకున్నవి కేసులు

2026 34 06

2025 73 16

2024 25 11

2023 38 13 2022 41 14

2021 42 12

2020 50 03

2019 30 03

2018 15 01

2017 09 01

పర్వతారోహణ ఒక కల. ఎవరెస్ట్‌ ఎక్కడానికి ఏప్రిల్‌, మే నెల అనువైనది. పర్వతారోహణకు కనీసం 6 నెలల ముందు నుంచే శిక్షణ తీసుకోవాలి. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి రన్నింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, మెట్లు ఎక్కడం వంటివి రోజూ సాధన చేయాలి. వీపుపై 15 నుంచి 20 కిలోల బరువున్న బ్యాగ్‌ని వేసుకుని ఎత్తయిన ప్రదేశాల్లో నడవడం ప్రాక్టీస్‌ చేయాలి. తీవ్రమైన చలి, శారీరక అలసటను తట్టుకునేలా మానసిక దృఢత్వం సాధించాలి. అత్యవసర పరిస్థితుల్లో భయపడకుండా ఉండేలా శిక్షణ పొందాలి. పర్వతం ఎత్తుకు వెళ్లే కొద్దీ గాలి తగ్గుతుంది. శరీరం ఆ వాతావరణానికి అలవాటు పడటానికి బేస్‌ క్యాంపుల వద్ద కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్లాలి. ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఎవరెస్ట్‌ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. వారంతా తగు జాగ్రత్తలు పాటించాలి.

నల్లగొండ : కాలం మారుతున్నా.. సమాజం ఆధునికత వైపు పరుగులు తీస్తున్నా.. మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నా కొందరు తల్లిదండ్రుల ఆలోచనలో మాత్రం మార్పు రావడం లేదు. చదువుకోవాల్సిన వయస్సులో తమ ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తూ వారి బాల్యాన్ని మూడు ముళ్లతో బంధిస్తున్నారు. బాలికలకు వివాహాలు చేస్తూ భార్యలు, తల్లులుగా మారుస్తూ వారి జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత వేసవిలో ఎక్కడో ఒకచోట బాల్యవివాహం జరుగుతూనే ఉండడం ఇందుకు నిదర్శనం.

అడ్డుకున్నా.. ఆగట్లేదు!

జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్‌ అధికారులు బాల్య వివాహాలు అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామ స్థాయిలో అంగన్‌వాడీలు, ఆశ వర్కర్లు, పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ సమాచారం అందిన వెంటనే స్పందిస్తూ బాల్య వివాహాలను పెళ్లిపీటల మీదనే అడ్డుకుంటున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు 357 బాల్య వివాహాలను అడ్డకున్నారు. కాగా చట్ట విరుద్ధంగా బాల్య వివాహాలు చేసినందుకు సంబంధికులపై పోలీస్‌ స్టేషన్లలో 2017 నుంచి ఇప్పటి వరకు 80 కేసులు నమోదయ్యాయి.

మారని తల్లిదండ్రుల తీరు

పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక ఆచారాలు, ఆడపిల్లల భద్రతపై భయాలు, బాల్య వివాహాలకు ప్రధాన కారణమవుతున్నాయి. ఆడపిల్ల భారమనే పాతతరం భావాల నుంచి బయట పడలేకపోతున్నారు కొందరు తల్లిదండ్రులు. మరికొందరు టీనేజీ ప్రేమలు, భద్రతా సమస్యల నెపంతో చట్టాలను పట్టించుకోకుండా చిన్న వయస్సులోనే బాలికలకు వివాహాలు చేస్తున్నారు. అధికారులు అడ్డుకుంటున్న వివాహాలు ఆగడం లేదు.

అమరుల కుటుంబాలను

ఆదుకుంటాం

జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌

మోత్కూరు : తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాకే అమరుల కుటుంబాలు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతోందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేత, తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి మాతృమూర్తి శంకరమ్మ రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాళ్లుగా నియామకమైన సందర్భంగా వారికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మోత్కూరులో సన్మాన సభ నిర్వహించారు. ముందుగా అయిలమ్మ, శ్రీకాంతాచారి చిత్రపటాలకు మంత్రి, ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన తొలి, మలిదశ దశ ఉద్యమాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే పురుడు పోసుకున్నాయన్నారు. కాసోజు శంకరమ్మను బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో అవమానిస్తే నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆమెతోపాటు చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాళ్లుగా నియమించి తగిన గౌరవం ఇచ్చిందన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ మాట్లాడుతూ గద్దర్‌ బిడ్డకు సైతం తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్‌ పదవి ఇచ్చి ప్రభుత్వం గౌరవించిందన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు చిట్యాల శ్వేత మాట్లాడుతూ మహిళా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కాసోజు శంకరమ్మ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకున్నారన్నారు. ఈ సందర్భంగా కళాకా రుడు గిద్ద రామనర్సయ్య బృందం ఆట, పాటలు అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు చెవిటి వెంకన్న, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, చౌటుప్పల్‌ డీఎస్పీ పి.మధుసూదన్‌రెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్‌నేత, మోత్కూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గడ్డం స్వప్న, వైస్‌ చైర్మన్‌ పల్లెర్ల వెంకన్న, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ విమల తదితరులు ఉన్నారు.

ఎవరెస్ట్‌ అధిరోహణలోప్రాణాలు కోల్పోతే..

మృతదేహాలను కిందికి తీసుకురాలేక, అక్కడే వదిలేస్తారు. కృత్రిమ ఆక్సిజన్‌ సహాయంతో ముందుకు సాగే సాహసకులు బరువును కోల్పోతారు. మైదాన ప్రాంతంలో పది కిలో మీటర్లు పరుగెత్తే వారు ఎవరెస్ట్‌ మీద ఆయాసంతో కనీసం ఒక్క అడుగు కూడా వేయడానికి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి శవాలను తీసుకురావడానికి ముందుకు వచ్చే వారు తక్కువగా ఉంటారు. సాధారణ మనిషి బరువు 50 నుంచి 60 కిలోలు ఉంటే, వారి ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇతర సామగ్రి బరువు మరో 5 నుంచి 10 కిలోలు ఉంటుంది. ఎవరెస్ట్‌పై దారులు చాలా ఇరుగ్గా, లోయలతో ఉంటాయి. అడుగు అటుఇటు పడితే లోయల్లోకి జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ దారుల్లో, ఒక మృతదేహం, లేదా ప్రమాదంలో చిక్కుకున్నవారిని కిందికి తీసుకురావాలంటే ఎంతో రిస్క్‌. ప్రస్తుతం ఎవరెస్ట్‌పై ఎక్కువ మరణాలు సంభవిస్తున్న ప్రాంతం ‘హిల్లరీ స్టెప్‌’. ఇక్కడ ఒక హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవ్వడానికి గానీ, తాడు కిందకి వేసి రక్షించడానికి గానీ వీలుండదు. ఎందుకంటే ఆ ఎత్తులో హెలికాప్టర్‌ ఎక్కువసేపు ఆగలేదు.

సత్వర వైద్య సేవలు అందించాలి : కలెక్టర్‌

నల్లగొండ : నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌) ద్వారా సత్వర సేవలందించేందుకు డాక్టర్లు కృషి చేయాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. ఆసుపత్రి పనితీరుపై శుక్రవారం తన ఛాంబర్‌లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మానవనరులు, వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాలను వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గల కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సూపరింటెండెంట్‌ నరసింహారావు నేత, డీసీహెచ్‌ డాక్టర్‌ మాతృ, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పుట్ల శ్రీనివాస్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నగేష్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

కొండమల్లేపల్లి మండలం చింతకుంట్లకు చెందిన బాలిక తల్లిదండ్రులు మరణించగా తాత సంరక్షణలో పెరిగింది. కట్నం తక్కువ తీసుకునే అబ్బాయిని చూసి ఆ బాలికకు పెళ్లి చేయాలని ఆమె తాత నిశ్చయించాడు. గతేడాది మేలో బాల్య వివాహం చేస్తుండగా సమాచారం తెలుసుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ అధికారులు చింతకుంట్లకు వెళ్లి అడ్డుకున్నారు. బంధువులు, బాలికకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. బాలికను చింతకుంట్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో చేర్పించి పదో తరగతి చదివించగా ఈ ఏడాది 416 మార్కులు సాధించింది. తన మనవరాలు మేజర్‌ అయ్యేంత వరకు పెళ్లి చేయనని ఆ బాలిక తాత పేర్కొన్నారు.

వేములపల్లి మండలం రావులపెంటకు చెందిన బాలికకు తల్లిదండ్రులు బాల్య వివాహం చేయాలనుకున్నారు. తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతోపాటు మంచి సంబంధం వచ్చిందని మధ్యవర్తి సంబంధం తేవడంతో గతనెలలో మొదటి వారంలో పెళ్లి నిశ్చయించారు. ఈ సమాచారం తెలిసిన ఐసీడీఎస్‌, బాలల సంరక్షణ అధికారులు బాలిక కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి గ్రామ సర్పంచ్‌ సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇచ్చి గతనెల 9న చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఎదుట హాజరు పరిచారు. దీంతో ఆ బాలిక ప్రస్తుతం సూర్యాపేటలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది.

నల్లగొండ మండలం ఆర్జాలబావికి చెందిన ఓ బాలికకు తన కుటుంబ సభ్యులు ఆమెకు ఇష్టం లేకున్నా కనగల్‌ మండలం అజలాపురానికి చెందిన వ్యక్తితో బాల్య వివాహం చేయాలని చూశారు. ఈ ఏడాది మార్చి 6న బాలికకు వివాహం చేస్తున్నారని 1098కు ఫోన్‌ రావడంతో శిశు సంక్షేమ అధికారులు అక్కడకు చేరుకుని బాల్య వివాహం ఆపారు. అందరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆ బాలిక నల్లగొండలోని ఒక ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement